
నయీమ్ డైరీ బయటపెట్టండి: రేవంత్
నయీమ్ డైరీని అడ్డు పెట్టుకుని నేతలపై బురద చల్లి బెదిరించాలని చూస్తే సహించేది లేదని రేవంత్ హెచ్చరించారు.
సాక్షి, హైదరాబాద్: ఉందో లేదో తెలియని గ్యాంగ్‌స్టర్ నయీమ్ డైరీని అడ్డు పెట్టుకుని తమ పార్టీకి చెందిన నేతలపై బురద చల్లి బెదిరించాలని చూస్తే సహించేది లేదని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి హెచ్చరించారు.నయీమ్ డైరీపై వార్తలు రావడమే తప్ప అది ఉందని సిట్ అధికారులు ఎప్పుడూ చెప్పలేదన్నా రు.
నిజంగానే ఉంటే ప్రభుత్వం దాన్ని సీజ్ చేసి అందులోని పేర్లను అధికారికంగా ప్రకటించాలన్నారు. శుక్రవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రాజెక్టులపై తెలంగాణకు నష్టం కలిగించేలా కుదుర్చుకున్న మహారా ష్ర్ట ఒప్పందాన్ని ప్రధాని చొరవ తీసుకుని రద్దు చేయించాలన్నారు.