తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ ముగిసింది. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్‌రాజు ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. సుమారు 50 మంది సినీ ప్రముఖులు సీఎంతో సమావేశమయ్యారు. ఈ సమావేశం రెండు గంటలకు పైగా జరిగింది. తెలంగాణలో చిత్ర పరిశ్రమ అభివృద్ధితో పాటు, పరిశ్రమ ఎదుర్కొంటోన్న సమస్యల గురించి సీఎం దృష్టికి సినీ పెద్దలు తీసుకెళ్లారు. ఈ క్రమంలో పలు అంశాలపై రేవంత్‌రెడ్డి కీలకవ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో టాలీవుడ్‌కు తమ ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని భరోసా కల్పించారు. తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోవడంతోనే ఆ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నామని సీఎం అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో సీరియస్‌గా ఉంటామని ఆయన తెలిపారు.
సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు
తెలంగాణలో శాంతిభద్రతల విషయంలో రాజీ లేదన్న సీఎం రేవంత్.
ఇక నుంచి బౌన్సర్లపై సీరియస్‌గా ఉంటామన్న సీఎం.
అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే..!
ప్రభుత్వం ఇండస్ట్రీతో ఉంటుందనే భరోసా ఇచ్చిన సీఎం.
తెలంగాణ రైజింగ్‌లో ఇండస్ట్రీ సోషల్ రెస్పాన్స్‌బిలిటీతో ఉండాలని కోరిన సీఎం.
డ్రగ్స్ క్యాంపెయిన్, మహిళా భద్రత క్యాంపెయిన్‌లో చొరవ చూపాలి.
టెంపుల్ టూరిజం, ఎకో టూరిజంను ప్రమోట్ చేయాలి.
ఇన్వెస్ట్‌మెంట్ల విషయంలోనూ ఇండస్ట్రీ సహకరించాలి.
ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని ఇండస్ట్రీ పెద్దలకు తేల్చి చెప్పిన సీఎం రేవంత్.
టికెట్ల రేట్లు పెంపు ఉండదని అసెంబ్లీలో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నామని సీఎం ప్రకటన.
ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్లనే.. తమ ప్రభుత్వం ఆ ఘటనను సీరియస్‌గా తీసుకుందన్న సీఎం రేవంత్.
సంధ్య థియేటర్ ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు సీఎం.
నాగార్జున వ్యాఖ్యలు
యూనివర్సల్ లెవెల్‌లో స్టూడియో సెటప్ హైదరబాద్‌లో కూడా ఉండాలి.
ప్రభుత్వం కేపిటల్ ఇన్సెంటివ్‌లు ఇస్తేనే అందుకు సాధ్యం అవుతుంది.
తెలుగు సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుంది. ఇందులో ప్రభుత్వాల సాయం కూడా అవసరం ఉంది.
హైదరాబాద్ వరల్డ్ సినిమాకు రాజధానిగా ఎదగాలనేది మా కోరిక.
రాఘవేంద్రరావు వ్యాఖ్యలు
ఇప్పటి వరకు అందరు ముఖ్యమంత్రులు తెలుగు ఇండస్ట్రీని బాగానే చూసుకున్నారు.
ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని బాగా చూసుకుంటుంది.
దిల్ రాజును FDC చైర్మన్‌గా నియమించడాన్ని మేము స్వాగతిస్తున్నాం.
తెలంగాణలో అద్భుతమైన టూరిస్ట్ స్పాట్‌లు ఉన్నాయి.
గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ హైదరాబాద్‌లోనే చేశారు.
ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను హైదరాబాద్‌లోనే నిర్వహించాలని కోరుతున్నాం.
మురళీమోహన్
ఎలక్షన్స్ ఫలితాల మాదిరే సినిమా రిలీజ్ నాడు వాతావరణం ఉంటుంది.
సంధ్య థియేటర్ ఘటన మమ్మల్ని కూడా బాధించింది.
సినిమా రిలీజ్ సమయంలో ఉండే కాంపిటిషన్ వల్లే ప్రమోషన్ కీలకంగా మారింది.
ప్రస్తుతం తెలుగు చిత్రాలు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానున్నడం వల్ల ప్రమోషన్‌ను విస్తృతంగా చేస్తున్నాం.
ప్రభుత్వ నిర్ణయాలపై తమకు పూర్తి నమ్మకం ఉందని నిర్మాత దగ్గుబాటి సురేష్‌బాబు అన్నారు. హైదరాబాద్‌ను ఇంటర్నేషనల్ ఫిల్మ్ డెస్టినేషన్ చేయాలనేది తమ కోరిక అంటూ ఆయన సీఎంతో పంచుకున్నారు. ప్రభుత్వ సాయంతోనే ఆరోజుల్లో చెన్నై నుంచి ఇండస్ట్రీ హైదరాబాద్‌కి వచ్చిందని సురేష్ బాబు గుర్తుచేశారు. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ సహా అన్ని ఏజెన్సీలకు హైదరాబాద్ కేరాఫ్‌గా ఉండాలని అన్నారు. ఇదే సమయంలో త్రివిక్రమ్ మాట్లాడుతూ.. మర్రిచెన్నారెడ్డి, అక్కినేని వల్లే పరిశ్రమ హైదరాబాద్‌కి వచ్చిందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment