బెనిఫిట్‌ షోలు, టికెట్‌ రేట్ల పెంపుపై క్లారిటీ ఇచ్చిన సీఎం | CM Revanth Reddy Comments On Benefit Shows And Ticket Rates Hike | Sakshi
Sakshi News home page

బెనిఫిట్‌ షోలు, టికెట్‌ రేట్ల పెంపుపై క్లారిటీ ఇచ్చిన సీఎం

Published Thu, Dec 26 2024 11:34 AM | Last Updated on Thu, Dec 26 2024 1:40 PM

CM Revanth Reddy Comments On Benefit Shows And Ticket Rates Hike

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సినీ ఇండస్ట్రీ ప్రముఖులు భేటీ అయ్యారు. ఇండస్ట్రీకి ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం అన్నారు. ఈ క్రమంలో పలు అంశాలపై రేవంత్‌రెడ్డి కీలకవ్యాఖ్యలు చేశారు.  

  • డ్రగ్స్‌కు వ్యతిరేకంగా సినిమా హీరోలు, హీరోయిన్లు ప్రచార కార్యక్రమంలో తప్పకుండా పాల్గొనాలి.

  •  తెలంగాణ ప్రభుత్వ పథకాలు, ప్రోత్సహకాలను ప్రచారం చేయాలి.

  • ప్రతి సినిమా ప్రదర్శనకు ముందు యాడ్‌ ప్లే చేయాలి.

  • సినిమా విడుదల సమయంలో హీరోల ర్యాలీలకు అనుమతి ఉండదు.

  •  సినిమా టికెట్లపై విధించే సెస్సు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణానికి వినియోగించాలి.

  • బెనిఫిట్‌ షోలు, టికెట్‌ రేట్ల పెంపు ఉండవని తేల్చి చెప్పిన ముఖ్యమంత్రి. 

  • అసెంబ్లీలో చెప్పిన మాటలకే కట్టబడి ఉంటామని తేల్చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

  • కులగణన సర్వే ప్రచార కార్యక్రమంలో నటీనటులు అందరూ సహకరించాలి.

  • చిత్ర పరిశ్రమకు ఎప్పటికీ అండగా ఉంటామని సీఎం భరోసా.

  • ఉద్దేశపూర్వకంగా ఎవరిపైనా కేసులు పెట్టలేదని క్లారిటీ ఇచ్చిన సీఎం. 

  • సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాటకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని చూపించిన పోలీసులు

    👉:​​​​​​​ (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement