తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సినీ ప్రముఖులు సమావేశం అయ్యారు. చిత్ర పరిశ్రమకు చెందిన సుమారు 50 మంది ప్రముఖులు గురువారం సీఎంను కలిసి ఇండస్ట్రీలోని సమస్యలు పంచుకున్నారు. అయితే, ఈ క్రమంలో సీఎం పలు విషయాలను వారితో చర్చించారు. ప్రభుత్వం ఎప్పటికీ ఇండస్ట్రీతోనే ఉందని సీఎం గుర్తుచేశారు. అయితే, రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని అన్నారు. సినిమా విడుదల సమయంలో అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదేనని ఆయన తేల్చి చెప్పారు. తెలంగాణ అభివృద్ధిలో పరిశ్రమ సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని సీఎం కోరారు.
ఈ అంశాలపై ప్రధాన చర్చ
- డ్రగ్స్‌కు వ్యతిరేకంగా సినిమా హీరోలు, హీరోయిన్లు ప్రచార కార్యక్రమంలో తప్పకుండా పాల్గొనాలి.
- తెలంగాణ ప్రభుత్వ పథకాలు, ప్రోత్సహకాలను ప్రచారం చేయాలి.
- ప్రతి సినిమా ప్రదర్శనకు ముందు యాడ్ ప్లే చేయాలి.
- సినిమా విడుదల సమయంలో హీరోల ర్యాలీలకు అనుమతి ఉండదు.
- సినిమా టికెట్లపై విధించే సెస్సు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణానికి వినియోగించాలి.
- బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు ఉండవని తేల్చి చెప్పిన ముఖ్యమంత్రి.
- అసెంబ్లీలో చెప్పిన మాటలకే కట్టబడి ఉంటామని తేల్చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.
- కులగణన సర్వే ప్రచార కార్యక్రమంలో నటీనటులు అందరూ సహకరించాలి.
- చిత్ర పరిశ్రమకు ఎప్పటికీ అండగా ఉంటామని సీఎం భరోసా.
- ఉద్దేశపూర్వకంగా ఎవరిపైనా కేసులు పెట్టలేదని క్లారిటీ ఇచ్చిన సీఎం.
- సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని చూపించిన పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment