
రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం
వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి కుటుంబం ఇసుక దందాలో కూరుకుపోయిందని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
నిజామాబాద్: వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి కుటుంబం ఇసుక దందాలో కూరుకు పోయిందని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా శనివారం మండలంలోని నర్సుల్లాబాద్ చౌరస్తా వద్ద టీఆర్ కార్యకర్తలు ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు.
మరోసారి ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని స్థానిక టీఆర్‌ఎస్ నాయకులు రేవంత్ రెడ్డిని హెచ్చరించారు. అదే సమయంలో రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
(బీర్కూర్)