సీఎం రేవంత్‌రెడ్డిపై డీకే అరుణ ఫైర్‌ | Bjp Mp Dk Aruna Counter To Cm Revanthreddy | Sakshi
Sakshi News home page

సీఎం రేవంత్‌రెడ్డిపై ఎంపీ డీకే అరుణ ఫైర్‌

Published Sun, Nov 3 2024 12:17 PM | Last Updated on Sun, Nov 3 2024 12:44 PM

Bjp Mp Dk Aruna Counter To Cm Revanthreddy

సాక్షి,హైదరాబాద్‌:సీఎం రేవంత్‌రెడ్డిపై బీజేపీ సీనియర్‌నేత, మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ ఫైర్‌ అయ్యారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలపై తాజాగా రేవంత్‌రెడ్డి చేసిన ట్వీట్‌పై డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం(నవంబర్‌ 3)డీకే అరుణ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.

‘సోనియా గాంధీ పుట్టిన రోజునాడే అన్నీ గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. ఏడాది కావస్తున్నా ఇంతవరకు ఏ ఒక్క హామీ పూర్తిగా అమలు చేయలేదు. ఒక్క ఇల్లు నిర్మాణం మొదల పెట్టలేదు. కేంద్రం నిధులు లేకుండా వీళ్ళు ఇళ్లు కడతారా? రైతు రుణమాఫీ సగం మందికి కాలేదు. సిగ్గులేకుండా రేవంత్ అబద్ధాలు చెప్తున్నారు. పక్క రాష్ట్రంలో అక్కడి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఫ్రీబస్ స్కీమ్‌ ఎత్తేస్తాం అంటున్నారు.

గ్రామాలకు బస్సులు బంద్ చేసి తెలంగాణలో  ఫ్రీ బస్ అంటున్నారు. మోదీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల వైఫల్యాలు ఎత్తి చూపారు. ఆయన వ్యాఖ్యలపై మాట్లాడడానికి రేవంత్‌రెడ్డికి సిగ్గుండాలి. 500 రూపాయలకే సిలిండర్‌లో కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ ఉంది. ఉజ్వల గ్యాస్ కనెక్షన్‌లన్నీ కేంద్రానీవే. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను భ్రమలో ఉంచుతున్నారు. కానీ ప్రజలు మేల్కొన్నారు. అన్ని అర్దం చేసుకుంటున్నారు.రైతు భరోసా లేదు. 

కౌలు రైతులకు,కూలీలకు సాయం దిక్కు లేదు. అమ్మాయిలకు స్కూటీలు ఎటు పాయే.50 వేల ఉద్యోగాల భర్తీ మాట పెద్ద బోగస్.10 లక్షల రూపాయల వైద్యం ఈ పది నెలల్లో ఎంతమందికి చేయించారో బయట పెట్టండి. చెప్పిన మాట నిలబెట్టుకోకుండ దబాయించాలని చూస్తున్నారు. కొత్తగా ఒక ఫించను దరఖాస్తు కూడా తీసుకోలేదు.కొత్త వితంతు ఫించన్లు రాక మహిళలు ఇబ్బందులు పడుతున్నారు’అని డీకే అరుణ మండిపడ్డారు. 

ఇదీ చదవండి: పీఎం నరేంద్రమోదీ వర్సెస్‌ సీఎం రేవంత్‌రెడ్డి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement