సాక్షి,హైదరాబాద్:మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ తమ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలకు సీఎం రేవంత్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఎక్స్(ట్విటర్) వేదికగా శనివారం(నవంబర్ 2) రేవంత్‌రెడ్డి ఒక పోస్టు చేశారు.‘ప్రధాని మోదీ చేసిన ప్రకటనలో అనేక అవాస్తవాలున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ప్రజల జీవితాల్లో వెలుగులు వచ్చాయి.
టీజీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల బీమా వంటి హామీలను నెరవేర్చాం.22 లక్షల 22 వేల మంది రైతులకు రుణమాఫీ చేశాం.25 రోజుల్లో 18 వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేశాం.పేదల ఇళ్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఎక్కువగా ఉంటే,కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలో కేవలం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ లభిస్తోంది.ఈ పథకం కింద 42,90,246 మంది లబ్ధిపొందారు. యువతకు వేల ఉద్యోగాలిచ్చాం’అని రేవంత్‌రెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి: నోటికందే కూడు నీటిపాలు
Comments
Please login to add a commentAdd a comment