
''ఓటుకు నోటు'లో ఏసీబీ పాత్రధారి..కేసీఆర్ సూత్రధారి'
ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని కావాలనే 'ఓటుకు నోటు' కుట్రలో ఇరికించారని టీడీపీ శాసనసభాపక్షనేత ఎర్రబెల్లి దయాకర్రావు ఆరోపించారు.
హైదరాబాద్: ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని కావాలనే 'ఓటుకు నోటు' కుట్రలో ఇరికించారని టీడీపీ శాసనసభాపక్షనేత ఎర్రబెల్లి దయాకర్రావు ఆరోపించారు. అయితే ఈ కుట్రలో ఏసీబీ పాత్రధారి.. సీఎం కేసీఆర్ సూత్రధారి అని ఆయన విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక ఏడాది పాలన వైఫల్యాలపై నిమోజవర్గాల వారీగా పోరాటాలు చేస్తామని టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణ పేర్కొన్నారు. 63 ఎమ్మెల్యేలు ఉన్న టీఆర్ఎస్ తరఫున ఐదుగురు ఎమ్మెల్సీలు ఎలా గెలిచారన్న దానిపై గవర్నర్ నరసింహన్ విచారణ జరిపించాలన్నారు. అధికారం శాశ్వతం కాదని తెలిసి టీఆర్ఎస్ అక్రమాలకు పాల్పడుతుందని రమణ ఆరోపించారు.