'పదవులు ఇవ్వకుంటే.. రేషన్ డీలర్‌గా ఉండేవాడు' | errabelli dayakar has no value, says Revanth | Sakshi
Sakshi News home page

'పదవులు ఇవ్వకుంటే.. రేషన్ డీలర్‌గా ఉండేవాడు'

Published Thu, Apr 14 2016 10:59 PM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM

'పదవులు ఇవ్వకుంటే.. రేషన్ డీలర్‌గా ఉండేవాడు' - Sakshi

'పదవులు ఇవ్వకుంటే.. రేషన్ డీలర్‌గా ఉండేవాడు'

వరంగల్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు పాదయాత్ర నిర్వహించేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, కోడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి తెలిపారు. హన్మకొండలో గురువారం నిర్వహించిన జిల్లా టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయంగా భిక్ష పెట్టి, అన్ని పదవులను కట్టబెట్టిన తెలుగుదేశం పార్టీకి ఎర్రబెల్లి దయాకర్‌రావు ద్రోహం చేసి టీఆర్‌ఎస్‌లో చేరాడని, అక్కడ చెల్లని పైసగా మారాడని విమర్శించారు. 
 
టీడీపీ లో ఉన్నప్పుడు పదవులు ఇవ్వకుంటే దయాకర్‌రావు ఇంకా రేషన్ డీలర్‌గానే ఉండేవాడని రేవంత్ ఎద్దేశా చేశారు. తాము ఎంతో ప్రాధాన్యం ఇచ్చిన ఎర్రబెల్లి నేడు కేసీఆర్ ఫాంహౌస్ వద్ద పడిగాపులు పడాల్సిన దుస్థితిలో ఉన్నాడన్నారు. ఈ సమావేశంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాశ్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు గరికపాటి మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement