TS: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు | Telangana 2nd Day Budget Session 2024 Hyderabad | Sakshi
Sakshi News home page

TS: మండలిలో కొనసాగుతున్న రభస 

Published Fri, Feb 9 2024 10:03 AM | Last Updated on Fri, Feb 9 2024 12:32 PM

Telangana 2nd Day Budget Session 2024 Hyderabad - Sakshi

Updates...

పోచారం శ్రీనివాస్ రెడ్డి

  • నేను - సీఎం రేవంత్ రెడ్డి టీడీపీలో కలిసి కష్టపడి పనిచేశాము
  • నేను బీఆర్‌ఎస్‌లో అప్పుడే చేరిన.
  • 2011లో రేవంత్ రెడ్డి చెప్పినట్లు ఎమ్మెల్సీ రేసులో కిరణ్ కుమార్ రెడ్డి లేరు
  • మల్‌రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ , మహమూద్‌ అలీ బీఆర్‌ఎస్‌ నుంచి రేసులో ఉన్నారు
  • రేవంత్ చెప్పిన ముగ్గురు ఎమ్మెల్యేలు లాలూచీ పడి కాంగ్రెస్కు ఆనాడు ఓటు వేశారు
  • ఆనాడు బీజేపీ లేదు.. మాకు బీజేపీకి ఎలాంటి సంబంధాలు లేవు
  • సీఎం కుర్చీ మార్చాలంటే మేమే వంద మందికి పైగా ఉన్నాము
  • మోడీతో మాకు  చర్చలు అవసరం లేదు
  • నిజాలు మాట్లాడితే బాగుంటుంది

గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలో సీఎం రేవంత్‌రెడ్డి

  • కేంద్రం తెచ్చిన అన్ని బిల్లులకు బీఆర్‌ఎస్‌ మద్దతు ఇచ్చింది
  • 2014-24 వరకు పార్లమెంట్‌లో ఎవరి పక్షాన నిలిచారు?
  • బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒకే ఆలోచనతో నడుస్తున్నాయి
     

పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే

  • ప్రజా పాలన అంటారు అసెంబ్లీ చుట్టూ ఇనుప కంచెలు వేశారు.
  • ప్రజా ప్రభుత్వంలో దిగ్బంధం ఎందుకు చేస్తున్నారు.
  • పోలీసుల సంఖ్య ఎందుకు పెంచారు.

పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే మాజీ స్పీకర్

  • సభ ఆర్డర్ లో ఉండటం లేదు.
  • ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది.
  • చిన్న వయసులో రేవంత్ సిఎం అయ్యారు.
  • ఐదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలని దేవున్ని ప్రార్థిస్తున్నాను.
  • చిల్లర మల్లర రాజకీయాలు, కామెంట్స్ వద్దు.
  • ఆరు గ్యారెంటీలు అమలు చేయాలి.

సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పకపోతే ఈ రాత్రికి శాసన మండలిలోనే ఉండే ఆలోచన లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు

కచ్చితంగా శాసన మండలి కి రావాలి, క్షమాపణ చెప్పాలి

ఐటి అంశంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి వర్సెస్ మంత్రి శ్రీధర్ బాబు

  • గతంలో దావోస్ వెళ్తే విమర్శలు చేసింది కాంగ్రెస్ - పల్లా 
  • ఇప్పుడు సిఎం దావోస్ పర్యటనలో అదానీ గ్రూప్ తో ఒప్పందం చేసుకున్నారు
  • అధానిపై ఆరోపణలు చేస్తూనే ...మరోవైపు ఒప్పందాలు చేసుకుంటుంది కాంగ్రెస్

మంత్రి శ్రీధర్ బాబు

  •  రాష్ట్ర అభివృద్ధి కోసం అందరినీ కలుపుకొని వెళ్తాము.
  • నిబంధనల ప్రకారమే పరిశ్రమల ఒప్పందాలు జరిగాయి.
  • ఐటి అభివృద్ధి పై సలహాలు సూచనలు తీసుకుంటాము.

► తెలంగాణ శాసమండలికి భోజన విరామం

శాసన మండలిలో గందరగోళం

  • బీఆర్‌ఎస్‌ నేతల చిట్టా మా దగ్గర ఉంది: జూపల్లి కృష్ణా రావు
  • ఎవరెవరి మీద ఎన్ని కేసులు ఉన్నాయో మాకు తెలుసు

  • గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం తెలపకుండ అడ్డుకోవడం మంచిది కాదు: మంత్రి తుమ్మల
  • సభ గౌరవం పాటించక పోవడం సబబు కాదు

అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి వర్సెస్ మంత్రులు మంత్రి పొన్నం ప్రభాకర్, సీతక్క

  • ఆర్టీసి కార్మికులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
  • రాష్ట్రంలో ఆర్టీసి బస్సులను పెంచాలి.
  • ఆర్టీసి అంశంపై మాట్లాడుతుండగా అడ్డుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్.
  • మొన్నటి వరకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆర్టీసి, ఆటోలను పట్టించుకోలేదు.
  • ఆటో, ఆర్టీసి కార్మికులు 60 రోజులు సమ్మె చేస్తే పట్టించుకోలేదు.
  • ఆటో కార్మికులకు కనీసం 1000 రూపాయలు ఇవ్వని వాళ్ళు బీఆర్‌ఎస్‌

ఫ్యూడల్స్ ఆటోలలో వస్తున్నారు

  • మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం కావాలా వద్దా? బీఆర్‌ఎస్‌ స్పష్టం చేయాలి.
  • ఆర్టీసి, ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే  బీఆర్‌ఎస్‌ పట్టించుకోలేదు.
  • ఆర్టీసి అభివృద్ధి పై ప్రభుత్వం కట్టుబడి ఉంది.

మంత్రి సీతక్క

  • మహిళలు ఉచిత ప్రయాణం చేస్తే BRS ఓర్వలేక పోతున్నారు.
  • ఆర్టీసి ఉచిత ప్రయాణం కావాలా వద్దా అనేది సూటిగా చెప్పాలి.
  • BRS మళ్ళీ సెంటిమెంట్ రాజకీయాలు మొదలు పెట్టింది.
  • గతంలో అగ్గిపెట్టె దొరక్క యువకులు ఆత్మహత్య చేసుకున్నారు.
  • ఆర్టీసి ఆస్తులను అమ్ముకున్నది BRS ప్రభుత్వం

ముగిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీల సమావేశం

  • సమావేశం వివరాలను మంత్రులకు చైర్మన్కు వివరిస్తున్న ఎమ్మెల్సీ భాను ప్రసాద్
  • సీఎం మండలికి వచ్చి క్షమాపణ చెప్పాల్సిందే అంటున్న ఎమ్మెల్సీలు
  • సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే కౌన్సిల్ సభ్యులకు క్షమాపణలు చెప్పే వరకు మండలి నిర్వహించొద్దు అని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు నినాదాలు 
  • సీఎం డౌన్.. డౌన్.. అంటూ నినాదాలు చేసిన ఎమ్మెల్సీలు
  • మరోసారి 10 నిమిషాలు మండలిని వాయిదా వేసిన కౌన్సిల్ చైర్మన్

జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ

  • కౌన్సిల్ ను బీఆర్‌ఎస్‌ సభ్యులు అగౌరపరుస్తున్నారు 
  • భారాస ఎమ్మెల్సీలు చేసిన ఫిర్యాదును ప్రివిలేజ్ కమిటీకి పంపారు 
  • పెద్దల సభలో ఓపిక ఉండాలి 

జూపల్లి కృష్ణారావు మంత్రి

  • బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలకు ఈ విషయంలో ప్రొటెక్ట్ చేసే హక్కులేదు 
  • అనవసరంగా సభను బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు తప్పు దోవ పట్టిస్తున్నారు

► కౌన్సిల్ హాల్ ముందు నల్ల కండువాలతో బైటాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు

తెలంగాణ శాసన మండలిలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీల ఆందోళన
బీఆర్‌ఎస్‌ సభ్యుల ఆందోళనలతో సభ వాయిదా పడింది
► సీఎం రేవంత్‌రెడ్డి మండలి సభ్యులను అవమానించారని.. మండలి సభ్యులకు సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. 
► బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలకు నిరసన తెలిపే హక్కు లేదు: మంత్రి జూపల్లి

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండోరోజు ప్రారంభం అయ్యాయి. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మాన్నాన్ని ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రవేశపెట్టారు.  
గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మాన్నాన్ని యన్నెం శ్రీనివాస్‌రెడ్డి బలపరిచారు. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీఎసీ అజెండాను టేబుల్‌ చేయనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement