
నమ్మి ఓట్లేసిన ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తోంది.. కాంగ్రెస్ నేతలకు పరిపాలన చేతకావటంలేదు...
సాక్షి, హైదరాబాద్: అధికారంలోకి వచ్చాక కూడా కాంగ్రెస్ అబద్ధాలు ఆడుతోందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. విభజన చట్టాన్ని తయారుచేసింది.. ఆనాటి కాంగ్రెస్ నాయకులు కాదా? అని సూటిగా ప్రశ్నించారు. విభజన చట్టంతో తమకేం సంబంధం లేదని తెలిపారు. చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి వంద అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు.
తమపై సీఎం రేవంత్‌రెడ్డి పసలేని ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. నమ్మి ఓట్లేసిన ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తోందని అన్నారు. రుణమాఫీ, రైతు బంధు, ఉద్యోగాల నోటీఫికేషన్లపై మాట తప్పారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలకు పరిపాలన చేతకావటంలేదని ఎద్దేవా చేశారు.