
సాక్షి,హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో)ను బీఆర్‌ఎస్ నేతలు కోరారు. ఈ మేరకు రేవంత్‌రెడ్డిపై సీఈవోకు బీఆర్‌ఎస్ నేతలు బుధవారం(మే1) ఫిర్యాదు చేశారు.
ప్రతిపక్షనేత బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్‌రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉస్మానియా పవర్ కట్ ఘటనను ఉదాహరిస్తూ రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్‌పై తప్పుడు ఆరోపణలు చేశారని తెలిపారు. కాగా, కాం గ్రెస్ ఫిర్యాదుతో ఈసీ కేసీఆర్‌పై ఇప్పటికే చర్య తీసుకుంది. 48 గంటల పాటు ప్రచారాన్ని ఆపాలని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment