
సంధ్య థియేటర్ ఘటన గురించి తన కుమారుడు అల్లు అర్జున్‌పై వస్తున్న విమర్శల పట్ల అల్లు అరవింద్ కూడా రెస్పాండ్ అయ్యారు. తన కుమారుడి వ్యక్తిత్వాన్ని తక్కువ చేసి మాట్లాడటం తట్టుకోలేకపోతున్నామని ఆయన అన్నారు. రేవతి కుటుంబం విషయంలో న్యాయవాదుల సూచన మేరకే బన్నీ మాట్లాడుతున్నాడని ఆయన గుర్తు చేశారు.
'దయచేసి అందరూ ఈ విషయం అర్థం చేసుకోండి. ప్రస్తుతం కేసు విచారణలో ఉండగా న్యాయపరమైన చిక్కులు వస్తాయనే ఉద్దేశంతో మీరు అడిగే ప్రశ్నలకు బన్నీ సమాధానం చెప్పలేకపోతున్నాడు. సుమారు మూడేళ్లు కష్టపడి పాన్ ఇండియా రేంజ్‌లో తీసిని సినిమాను అభిమానులతో చూద్దామని థియేటర్‌కు వెళ్లాడు. అయితే, థియేటర్ వద్ద జరిగిన ఆ సంఘటనతో బన్నీ మా ఇంట్లో పార్కులో ఓ మూలన కూర్చొని ఉంటున్నాడు. సినిమా సెలబ్రేషన్స్ వద్దని చెప్పాడు.
సినిమా ఇంతటి విజయం సాధించినప్పటికీ ఎలాంటి సంతోషం లేకుండానే తన అభిమాని కుటుంబం ఇలా అయిపోయిందని బాధపడుతున్నాడు. బన్నీ ఇంతటి స్థాయిలోకి రావడానికి 22 ఏళ్లుగా కష్టపడుతున్నాడు. అతనికి వచ్చిన పేరు అంతా కూడా ఒక రాత్రి, ఒక సినిమాతో రాలేదు. మూడు తరాలుగా ఇండస్ట్రీలోనే ఉంటున్నాం. ఎక్కడా కూడా చెడుగా వ్యవహరించలేదు. ఇప్పడు మాపై ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తేంటే బాధగా ఉండటం వల్లే మీడియా ముందుకు వచ్చాం.' అని అల్లు అరవింద్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment