చేవెళ్ల: నూటికి నూరు శాతం ఇచ్చిన హామీలు అమలు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌డ్డి అన్నారు. కేసీఆర్ మనిషివా.. మానవ రూపంలో ఉన్న మృగానివా? అని సూటిగా ప్రశ్నించారు. చేవెళ్ల కాంగ్రెస్ జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తున్నారు.
‘నీళ్ళ ముసుగులో భారీ దోపిడీ జరిగింది. మహిళలను కోటీశ్వరులను చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఏ ఆడబిడ్డ కళ్లలో కట్టెల పొయ్యితో నీళ్ళు రావొద్దని.. రూ.500కే గ్యాస్ సిలెండర్ అందిస్తున్నాం. పథకాలు రాలేదని బాధపడోద్దు. ఎమ్మార్వో, ఎంపీడీవో దగ్గరకు వెళ్ళి ఉచిత విద్యుత్ పథకం, రూ.500లకే గ్యాస్ సిలెండర్ అందించే పథకం అందివ్వాలని కోరుతున్నా. కార్యకర్తలు కష్టపడితేనే మేము నాయకులం అయ్యాం. 14 ఎంపీలను గెలిపించే బాధ్యత మనది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలను గెలిపించే బాధ్యత నాది. 5 మంది సభ్యులతో ఇందిరమ్మ కమిటీతో పథకాలు అమలు చేస్తాం.
... అధికారం వచ్చిన తర్వాత కార్యకర్తలను మరిచిపోతారనీ అంటారు. నేను మాత్రం కార్యకర్తల కోసం పనిచేస్తా. జిల్లాలు,నియోజకవర్గాల్లో తిరుగుతా. బీజేపీ చెబుతున్న గుజరాత్ మోడల్ అంటే ఎంటి?. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా అన్నారు ఏమైంది?. మా ఊర్లో వడ్లు కొనేవారు లేదు. తాండూరులో కందులు కొనేవాళ్లు లేరు. గుజరాత్ మోడల్ అంటే ప్రభుత్వాలు పడగొట్టడమా!. ఎన్నికలు వస్తె బీజేపీ నేతలు ఈడి, సీబీఐలను పంపుతారు. బీజేపీ వాళ్లకు ఓటు వేయడం దండగ. కార్యకర్తలు గెలిచినప్పుడే కాంగ్రెస్‌ది నిజమైన గెలుపు’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment