
సాక్షి,ఢిల్లీ: కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో సోమవారం(జులై 22) భేటీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్‌కు సహకరించాలని కేంద్ర మంత్రిని ఈ సందర్భంగా సీఎం విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్ నగరంలోని మురికి నీరు అంతా మూసీలో చేరుతోందని, దానిని శుద్ది చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందన్నారు. జాతీయ నదీ పరిరక్షణ ప్రణాళిక కింద మూసీలో శుద్ధి పనులకు రూ.4 వేల కోట్లు ఇవ్వాలని కోరారు.
గోదావరి నది జలాలను ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లతో నింపే పనులకు రూ.6 వేల కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌ను గోదావరి నీటితో నింపితే హైదరాబాద్ నగరానికి తాగునీటి ఇబ్బందులు ఉండవని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ దృష్టికి రేవంత్‌రెడ్డి తీసుకెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment