
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పీసీపీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీకి బయలుదేరారు. ఆయన రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు. పర్యటనలో భాగంగా కార్యవర్గం కూర్పు, ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. అలాగే, వీహెచ్ పుస్తక ఆవిష్కరణలో పాల్గొననున్నారు.
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మరోసారి ఢిల్లీకి బయలుదేరారు. రెండు రోజుల పర్యటన నేపథ్యంలో పార్టీ పెద్దలను ఆయన కలువనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంది. అలాగే, కార్యవర్గం కూర్పు ఇతర అంశాలు చర్చకు వచ్చే అవకాశం కూడా ఉన్నట్టు సమాచారం. ఇక, రేపు సాయంత్రం ఢిల్లీలో జరగనున్న వీహెచ్ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో మహేష్ గౌడ్ పాల్గొననున్నారు.