సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్లలో రూ.7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళా తీసిందని అన్నారు పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్. బుధవారం హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. క్రమశిక్షణ ఉల్లంగిస్తే చర్యలు తప్పవు. ఎంత పెద్దవారైనా ఉపేక్షించేది లేదు. పార్టీ లైన్‌లో పని చేయాల్సిందేనని ఆదేశించారు.
రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలు సాధించాలి. బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్లలో రూ. 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళా తీసింది. కానీ కాంగ్రెస్ అలా కాదు.. అధికారంలోకి వచ్చాక 10 నెలల కాలంలో అనేక అద్భుతమైన పనులు చేసింది.. అటు రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టింది. ఇచ్చిన హామీలను నెరవేర్చింది.
గ్రేటర్ ఎన్నికల్లో ప్రభుత్వం చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి మరింత విస్తారంగా తీసుకెళ్లాలి. రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలు సాధించాలి. మనం గట్టిగా పనిచేస్తేనే ప్రజల్లోకి వెళ్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చరిత్ర సృష్టించింది. ప్రభుత్వం చేస్తున్న పనులను నాయకులు లోతుగా అధ్యయనం చేయాలి.. అర్థం చేసుకోవాలి. ప్రజల్లో మంచి స్పందన ఉంది.
ప్రతి పక్ష బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు కలిసి పోయాయి.. రెండు పార్టీ లు కలిసి కాంగ్రెస్‌ను దెబ్బతీయాలని చూస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీ కుట్రల్ని మనం తిప్పికొట్టారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున గ్రేటర్ లో విజయం సాధిస్తేనే మనకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి హైదరాబాద్ జిల్లా నాయకులు పకడ్బందీగా పని చేసి ఫలితాలు సాధించాలి’అని బి.మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment