కష్టకాలంలో అండగా నిలవండి: రఘువీరా | Raghuveera reddy happy for appointed as Seemandhra PCC chief | Sakshi
Sakshi News home page

కష్టకాలంలో అండగా నిలవండి: రఘువీరా

Published Tue, Mar 11 2014 9:06 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

కష్టకాలంలో అండగా నిలవండి: రఘువీరా - Sakshi

కష్టకాలంలో అండగా నిలవండి: రఘువీరా

అనంతపురం: సీమాంధ్ర ప్రాంతానికి పీసీసీ అధ్యక్షుడిగా నియమించినందుకు మాజీ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నెరవేరుస్తానని చెప్పారు. కష్టకాలంలో కార్యకర్తలు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.

సీమాంధ్ర పీసీసీ చీఫ్గా రఘువీరాను, ప్రచార కమిటీ చైర్మన్గా కేంద్ర మంత్రి చిరంజీవిలను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. ఇతర కార్యవర్గాలను ప్రకటించింది. తెలంగాణ పీసీసీ చీఫ్గా పొన్నాల లక్ష్మయ్య, వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా ఉత్తమ్ కుమార్ రెడ్డిలను నియమించారు. పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగించేందుకు బొత్స సత్యనారాయణ నిరాకరించినట్టు సమాచారం. అనంతరం రఘువీరా మాట్లాడుతూ.. సీమాంధ్రలో కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇతర నాయకులను కలుపుకొని కలసికట్టుగా పనిచేస్తానని చెప్పారు. విభజన సమస్యను పక్కనబెట్టి అభివృద్దిపై దృష్టిపెడతానని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement