
రఘువీరా రెడ్డి
న్యూఢిల్లీ: సీమాంధ్ర పిసిసి అధ్యక్షుడుగా మాజీ మంత్రి రఘువీరా రెడ్డి నియామకం ఖరారైనట్లు తెలుస్తోంది. ప్రస్తుత పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తాను ఆ పదవిలో కొనసాగలేనని చేతులెత్తేయడంతో అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ రఘువీరారెడ్డితో ఫోన్లో మాట్లాడారు. పిసిసి బాధ్యతలు చేపట్టమని రఘువీరారెడ్డికి ఆమె సూచించినట్లు సమాచారం. రఘువీరా రెడ్డి రేపు ఢిల్లీ వెళతారు.
తెలంగాణ పిసిసి అధ్యక్షునిగా ఎవరిని ఎంపిక చేసింది ఇంకా వెల్లడించలేదు. అయితే మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పేరు దాదాపు ఖారైనట్లు తెలుస్తోంది. తెలంగాణ, ఆంధ్ర రెండు ప్రాంతాలలోనూ బిసి అభ్యర్థులకే పిసిసి బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది.