
లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల వేళ అరుణాచల్‌ప్రదేశ్ పీసీసీ చీఫ్ రాజీనామా చేశారు. అరుణాచల్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు నబమ్ టుకీ తన పదవికి రాజీనామా చేసినట్లు ఆ పార్టీ నాయకుడు ఒకరు శనివారం తెలిపారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఇటీవల బీజేపీలోకి ఫిరాయించిన నేపథ్యంలో నబమ్ టుకీ తన రాజీనామాను శుక్రవారం అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి పంపినట్లు తెలిసింది. తమ పార్టీ ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లోకి ఫిరాయించకుండా అడ్డుకోలేకపోయిందుకు నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేసినట్లు ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి గ్యామర్ తానా చెప్పారు.
నబమ్ టుకీ రాష్ట్రంలోని సగాలీ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సీఎల్‌పీ నాయకుడు, తూర్పు సియాంగ్ జిల్లాలోని మెబో నుండి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన లాంబో తాయెంగ్ ఇటీవల బీజేపీలో చేరారు. అలాగే గత నెలలో మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నినాంగ్ ఎరింగ్, వాంగ్లిన్ లోవాంగ్‌డాంగ్ బీజేపీలో చేరారు.
Comments
Please login to add a commentAdd a comment