సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ఫలితాలకు పీసీసీ అధ్యక్షుడి మార్పునకు సంబంధం ఉండదని, తనంతట తాను ఉత్తమ్ తప్పుకుంటే తప్ప పీసీసీ అధ్యక్షుడి మార్పు ఉండ దని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పారు. మంగళవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తమ్ తప్పుకుంటే పీసీసీ రేసులో రేవంత్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి బ్రదర్స్, పొన్నం ప్రభాకర్ లాంటి నేతలుంటారని అభిప్రాయపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టీఆర్‌ఎస్‌కు గట్టిపోటి ఇచ్చిందని చెప్పిన జగ్గారెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లాలో 20–25 జడ్పీటీసీ స్థానాల్లో కాంగ్రెస్ గెలు స్తుందని చెప్పారు. స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీకే సానుకూలత ఉంటుందని, అయినా కాంగ్రెస్ కూడా తగినన్ని స్థానాలు గెలుచుకుంటుందని చెప్పారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా గట్టి పోటీ ఇస్తామన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేంద్రం లో యూపీఏ అధికారంలోకి వస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment