డైలమాలో షీలా దీక్షిత్
న్యూఢిల్లీ: కేరళ గవర్నర్ షీలా దీక్షిత్ పదవి నుంచి వైదొలగాలా వద్దా అనే డైలామాలో పడ్డారు. సోమవారం ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశమయ్యారు. రాజీనామా చేసే విషయం గురించి చర్చించినట్టు సమాచారం. మంగళవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతోనూ షీలా భేటీ కానున్నారు. సుదీర్ఘకాలం ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిన షీలా.. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరపరాజయం అనంతరం యూపీఏ హయాంలో కేరళ గవర్నర్గా నియమితులయ్యారు.
యూపీఏ హయాంలో నియమితులైన గవర్నర్లందరూ వైదొలగాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే కొందరు గవర్నర్లు వైదొలగగా, మరికొందరు రాజీనామా చేయాలనే యోచనలో ఉన్నారు. మాటవినని గవర్నర్లపై కేంద్ర వేటు వేసి బదిలీ చేసింది. ఇంతకుముందు పదవి నుంచి వైదొలిగేది లేదన్న షీలా ఏంచేస్తారో చూడాలి.