దక్షిణాసియా జూడో చాంపియన్‌షిప్
న్యూఢిల్లీ: ఖాట్మండులో జరిగిన దక్షిణాసియా జూడో చాంపియన్‌షిప్‌లో భారత్ 10 స్వర్ణాలతో ఆధిపత్యం ప్రదర్శించింది. ఈ నెల 10 నుంచి 13 వరకు నిర్వహించిన ఈ పోటీల్లో 12 మందితో కూడిన భారత జుడోకాల బృందం 10 స్వర్ణాలతోపాటు ఒక్కొక్కటి చొప్పున రజతం, కాంస్య పతకాలు సాధించారు.
భారత్‌తోపాటు దక్షిణాసియాలోని అఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్థాన్, శ్రీలంక దేశాలు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. భారత బృందంలో పురుషుల విభాగంలో నవ్‌జోత్ చానా (60 కేజీ), ఐరోమ్ సంజూ సింగ్ (66 కేజీ), నవ్‌దీప్ చానా (73 కేజీ), వికేందర్ సింగ్ (81 కేజీ), అవతార్‌సింగ్ (90 కేజీ)లు స్వర్ణాలు సాధించగా, ఖెదైమ్ యైమా సింగ్ (100 కేజీ) రజతం దక్కించుకున్నాడు.
మహిళల్లో అంగోమ్ అనితా చాను (52 కేజీ), సుచికా తరియాల్ (57 కేజీ), గరిమా చౌదరి (63 కేజీ), హిడ్రామ్ సునిబాల దేవి (70 కేజీ), జైన దేవి (78 కేజీ)లు పసిడి, రజనీ బాల (48 కేజీ) కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు.
భారత్‌కు పది స్వర్ణాలు
Published Tue, Apr 15 2014 12:29 AM | Last Updated on Sat, Sep 2 2017 6:02 AM
Advertisement
Advertisement