నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం.. 18 మంది దుర్మరణం | Saurya Airlines plane crashes during takeoff in Kathmandu | Sakshi
Sakshi News home page

నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం.. 18 మంది దుర్మరణం

Published Wed, Jul 24 2024 11:49 AM | Last Updated on Wed, Jul 24 2024 1:23 PM

Saurya Airlines plane crashes during takeoff in Kathmandu

ఢిల్లీ: నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఖాట్మాండ్‌లోని త్రిభువన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో రన్‌వే నుంచి టేకాఫ్‌ తీసుకునే విమానం జారిపోయి కుప్పకూలింది. దీంతో విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.  

ప్రమాద సమయంలో విమానంలో ఉన్న 19 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో 18 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు 14 మృతదేహాలు లభ్యం అయ్యాయి. పైలట్ ప్రాణాలతో బయటపడ్డారు. ఆయన్ను ఖాఠ్మాండ్‌లోని మెడికల్ కాలేజీ టీచింగ్ ఆసుపత్రికి తరలించారు. 

ప్రమాదానికి గురైన విమానం శౌర్య ఎయిర్‌లైన్స్‌కు చెందింది. ప్రమాదం జరిగిన వెంటనే అంబులెన్స్‌లు, అగ్నిమాపక వాహనాలు అక్కడికి చేరుకున్నాయి. సహాయక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నేపాల్‌ ఆర్మీ తమ బృందాన్ని పంపించింది.  

కొన్నేళ్ల క్రితం త్రిభువన్ ఎయిర్‌పోర్ట్ వద్ద బంగ్లాదేశ్ ప్రయాణికుల విమానం కూలిపోయింది. ఈ ప్రమదంలో కూడా పదుల సంఖ్యలో ప్రయాణికులు మృతి చెందారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement