
ఖాట్మండు : సెంట్రల్ నేపాల్‌లోని కొండప్రాంతంలో శనివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆల్టిట్యూడ్ ఎయిర్ లైన్స్‌కు చెందిన ఓ హెలికాప్టర్ కుప్పకూలడంతో పైలట్ సహా ఏడుగురు గల్లంతయ్యారు. ఇందులో ఓ జపాన్ పర్యాటకుడితోపాటూ ఐదుగురు నేపాలీలు ఉన్నట్టు సమాచారం. నేపాల్‌లోని గోర్ఖా జిల్లాలోని సమాగౌన్ నుంచి హెలికాప్టర్ బయల్దేరిన కొద్దిసేపటికే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూంతో సంబంధాలు తెగిపోయాయి.
దట్టమైన అటవీ ప్రాంతమైన సత్యవాహిలో హెలికాప్టర్ శకలాలు ఉన్నట్టు గుర్తించారు. శకలాలు ఉన్న ప్రాంతం ఎత్తైన కొండపైన ఉండటం, ప్రతికూల వాతావరణం కారణంగా సహాయక చర్యలకు ఇబ్బందిగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment