కఠ్మాండ్ : నవంబర్ 26 ముంబయి దాడులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యలు చేశారు. ఆరేళ్ల క్రితం ముంబయిపై జరిగిన ఉగ్రవాదుల భీకర దాడిని మర్చిపోలేమని ఆయన అన్నారు. నాటి ఘటనలో బలైన అమాయకులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నామని మోదీ తెలిపారు. ఉగ్రవాదంపై పోరు కొనసాగించాల్సిందేనని 26/11 ఘటన గుర్తు చేస్తోందని ఆయన అన్నారు. సార్క్ దేశాల సదస్సులో పాల్గొనేందుకు మోదీ మంగళవారం కఠ్మాండు చేరుకున్న విషయం తెలిసిందే.
కాగా దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో ముష్కర మూకలు మారణహోమం సాగించి ఆరేళ్లు గడిచింది. 2008, నవంబర్ 26న పది మంది పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మూడు రోజుల పాటు సృష్టించిన నరమేధంలో విదేశీయులతో సహా 166 మంది బలైపోయారు. 300 మంది క్షతగాత్రులయ్యారు.
ఉగ్రవాదంపై పోరు కొనసాగించాల్సిందే: మోదీ
Published Wed, Nov 26 2014 8:42 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM
Advertisement