
నేపాల్‌లో చిక్కుకున్న టాలీవుడ్ బృందం!
నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారి సంఖ్య గంట గంటకూ పెరిగిపోతుంది. ఇప్పటికే హైదరాబాద్, గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందినవారు దాదాపు 40 మందికి పైగా ఖాట్మండులో చిక్కుకుపోయినట్లు సమాచారం. కాగా 'వెటకారం.కామ్' అనే టాలీవుడ్ చిత్ర బృందం 20 మంది ఫోన్లు కూడా పనిచేయడం లేదని బాధితుల బంధువులు మీడియాకు తెలిపారు.
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి అన్న కుమారుడైన వీరేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న 'వెటకారం.కామ్' అనే తెలుగు సినిమా చిత్రీకరణ కోసం నేపాల్‌కు వెళ్లిన వీరేందర్ రెడ్డి సహా మరో 20 మంది చిత్ర బృందం ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారు.