దోడా: జమ్మూ కాశ్మీర్‌లో శుక్రవారం భూమి కంపించింది. సాయంత్రం ఏడింటి సమయంలో దోడా, కిష్త్‌వార్ జిల్లాల్లో రిక్టర్ స్కేల్‌పై 5.2 తీవ్రతతో కూడిన ప్రకంపనలు నమోదయ్యాయి. దాంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. ఇప్పటిదాకా ఆస్తి, ప్రాణనష్టమేమీ నమోదు కాలేదు. భూకంప కేంద్రాన్ని సుక్లాన్ ధర్ ప్రాంతానికి 11 కి.మీ. దూరంలో గుర్తించారు. 2013లో కూడా మే-ఆగ స్టు మధ్య బదెర్వా, దోడా, కిష్త్‌వార్ ప్రాంతాల్లో 50కి పైగా భూ ప్రకంపనలు నమోదయ్యాయి.
కాశ్మీర్‌లో భూకంపం
Published Sat, Jun 14 2014 1:33 AM | Last Updated on Sat, Sep 2 2017 8:45 AM
Advertisement
Advertisement