జకర్తా: ఇండోనేషియాలో మంగళవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 6.0గా నమోదైంది. ఈ మేరకు ఇండోనేషియా వాతావరణ, జియో ఫిజిక్స్ ఎజెన్సీ అధికార ప్రతనిధి మాట్టాడుతూ సునామీ సృష్టించేంత తీవ్రంగా భూకంపం సంభవించకపోయినప్పటికీ ప్రజలను భయాందోళనకు గురిచేసే స్థాయిలో భూమి పలుసార్లు కంపించిందని చెప్పారు. ఉత్తర సులవేసి ప్రావిన్స్లోని సంఘీ ద్వీపానికి 71 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించామని తెలిపారు.