జకర్తా: ఇండోనేసియాలో గురువారం ఉదయం భూకంపం సంభవించింది. లాంబోక్ ప్రాంతంలో భూప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.2గా నమోదైందని అధికారులు తెలిపారు. అయితే ఈ వారంలో ఇండినేషియాలో భూకంపం రావడం ఇది మూడోసారి. నేటి ఉదయం మరోసారి భూప్రకంపనలు రావడంతో ప్రజలు భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.
కొన్ని ఇళ్లు ధ్వంసమయ్యాయి. అయితే నష్టం ఏ మేరకు వాటిల్లిందన్న విషయంలో అధికారులకు స్పష్టత రాలేదు. గత వారం రోజుల్లో ఇండోనేసియా ఉత్తర ప్రాంతంలో చాలా చోట్ల భూప్రకంపనలు సంభవించాయి. కాగా సునామీ వచ్చే అవకాశం లేదని ఇదివరకే వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.