
ముందే ఊహించారు!
ఇండియన్, యురేసియన్ టెక్టానిక్ ప్లేట్లు ఒకదానిలోకి ఒకటి చొచ్చుకుపోయే ప్రాంతం(ఫాల్ట్)ను ‘మెయిన్ ఫ్రంటల్ థ్రస్ట్(ఎంఎఫ్‌టీ)’ ఫాల్ట్‌గా పిలుస్తారు.
ఇండియన్, యురేసియన్ టెక్టానిక్ ప్లేట్లు ఒకదానిలోకి ఒకటి చొచ్చుకుపోయే ప్రాంతం(ఫాల్ట్)ను ‘మెయిన్ ఫ్రంటల్ థ్రస్ట్(ఎంఎఫ్‌టీ)’ ఫాల్ట్‌గా పిలుస్తారు. అయితే, ఈ ఫాల్ట్ ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 8 తీవ్రతతో భారీ భూకంపం వచ్చే అవకాశముందని సీఎస్‌ఐఆర్‌కు చెందిన ‘సెంటర్ ఫర్ మ్యాథమెటికల్ మాడలింగ్ అండ్ కంప్యూటర్ సిమ్యులేషన్’ సంస్థ భూకంప శాస్త్రవేత్త వినోద్ కుమార్ గౌర్ 2013లోనే అంచనా వేశారు. ఎంఎఫ్‌టీ ఫాల్ట్‌లో ఒత్తిడి తీవ్రంగా పెరిగిందని, దాని వల్ల 8 తీవ్రతతో భూకంపం వచ్చే అవకాశముందని వెల్లడించారు.
కానీ, భూకంపం కచ్చితంగా ఎప్పుడు వస్తుందో తెలియదని, ఈ శతాబ్దాంతంలోగా ఎప్పుడైనా రావొచ్చన్నారు. నేపాల్‌లో ఉన్న ఎంఎఫ్‌టీ ఫాల్ట్ ప్రాంతంలో భూకంపాల చరిత్రకు సంబంధించి సింగపూర్‌కు చెందిన నాన్యాంగ్ టెక్నలాజికల్ వర్సిటీ బృందం కూడా ఇటీవలి అధ్యయనాల్లో పలు ఆధారాలను కనుగొంది. భారీ భూకంపాలు వచ్చినచోట్ల భవిష్యత్తులోనూ అదే స్థాయి భూకంపాలు రావొచ్చని అంచనా వేసింది.