కాశ్మీర్ లో భూప్రకంపనలు, రిక్టర్ పై 4.9గా నమోదు
Published Tue, Jul 8 2014 11:09 PM | Last Updated on Sat, Sep 2 2017 10:00 AM
శ్రీనగర్: జమ్మూ,కాశ్మీర్ లో మంగళవారం రాత్రి భూమి కంపించింది. భూప్రకంపనలు రిక్టర్ స్కేల్ పై 4.9 గా నమోదైంది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్థినష్టం జరుగలేదని అధికారులు తెలిపారు.
జమ్మూ,కాశ్మీర్ లో మంగళవారం రాత్రి 9.06 గంటలకు భూమి కంపించింది. భూకంప తీవ్రత 4.9గా నమోదైంది అని సంబంధిత అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
భూమి కంపించిన సమయంలో ప్రజలందరూ ఒక్కసారిగా భయాందోళనలతో వీధుల్లో పరుగులు తీశారన్నారు. 2005 అక్టోబర్ 8 తేదిన సంభవించిన భూకంప (7.8) ప్రమాదంలో 40 వేలకు పైగా మృత్యువాత పడిన సంగతి తెలిసింది.
Advertisement
Advertisement