ఆందోళన వద్దు కలెక్టర్ జానకి
నెల్లూరు(పొగతోట): ఉదయగిరి, వింజ మూరు, వరికుంటపాడు ప్రాంతాల్లో సంభవిస్తున్న భూప్రకంపనలు చిన్నవే అని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని కలెక్టర్ ఎం.జానకి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 2015 అక్టోబర్ నుంచి వస్తున్న భూప్రకంపనలు రిక్టర్ స్కేల్‌పై తక్కువగా నమోదవుతున్నాయని తెలిపారు.
శనివారం వింజమూరు ప్రాంతంలో వచ్చిన భూప్రకంనాలు రిక్టర్ స్కేల్‌పై 2.5 నమోదు అయిందని తెలిపారు. వరికుంటపాడు, వింజమూరు మండలాల్లో భూకంప గుర్తింపు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. భూకంపనాలు భూగర్భంలో 3 నుంచి 5 కిలోమీటర్ల లోతులో సంభవిస్తున్నాయని శాస్త్రవేత్తలు తెలియజేశారని పేర్కొన్నారు. భూకంపనాలపై శాస్త్రవేత్తలు 24 గంటలు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.