ఈశాన్య రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు
ఈటానగర్/అగర్తలా: ఈశాన్య రాష్ట్రాల్లో బుధవారం వేకువజామున భూ భూకంపం సంభవించింది. త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. త్రిపురలో సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5 గా నమోదైంది. కమల్ పూర్‌లో పలు ఇళ్లు బీటలు వారాయి.
భూకంప భయంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మరోవైపు అరుణాచల్ ప్రదేశ్ లో కురుంగ్ కుమె జిల్లాలో భూ ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.3గా నమోదయిందని అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.