
సాక్షి, సిమ్లా : హిమాచల్ ప్రదేశ్‌లోని మండి ప్రాంతంలో శుక్రవారం భూమి స్పల్పంగా కంపించింది. ఉదయం 8:09 గంటల ప్రాంతంలో సంభవించిన ఈ భూకంపంలో ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించినట్లు ఎక్కడా నమోదు కాలేదు.
భూకంప తీవ్రత రెక్టర్ స్కేలుపై 4.4 పాయింట్లుగా నమోదైనట్లు భూకంప అధ్యయన కేంద్రం అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా ఈ నెల మొదటివారంలో చంబా ప్రాంతంలో ఇదే తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇలా వరుసగా భూకంపాలు సంభవిస్తుండడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో 1905లో అత్యంత తీవ్ర స్థాయిలో భూంకపం సంభవించింది. ఈ ఘటనలో సుమారు 20 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.
Comments
Please login to add a commentAdd a comment