జమ్మూకశ్మీర్లో శుక్రవారం భూకంపం సంభవించింది. వేకువజామున 3.29 ప్రాంతంలో ఏర్పడిన భూ ప్రకంపనలు రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతగా నమోదై చుట్టుపక్కల ప్రాంతాలను వణికించింది. అయితే దీనివల్ల ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణనష్టం చోటుచేసుకోలేదు. కాగా ఒక్కసారిగా ప్రకంపనలతో ప్రజలు భయంతోఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు.
చాలామంది ఈ ఘటన తర్వాత నిద్రలేకుండా మెలకువతో కూర్చున్నారు. 2005లో రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రతతో వచ్చిన భూకంపం కారణంగా 40 వేల మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సంభవించిన భూకంప కేంద్రం పాకిస్థాన్ ఉందని గుర్తించామని స్థానిక వాతావరణశాఖ తెలిపింది.