చైనాను బుధవారం భారీ భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.1గా నమోదైంది.
చైనాను బుధవారం భారీ భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.1గా నమోదైంది. ఈ ఘటనలో 87 మంది గాయపడగా 45 వేలకుపైగా ఇళ్లు దెబ్బతిన్నాయి. పలుచోట్ల హైవేలు, బ్రిడ్జిలు, రిజర్వాయర్లకు బీటలు వారాయి. చైనాలోని టిబెట్ పరిసర ప్రాంతాల్లో ఈ భూకంపం సంభవించింది. భూకంప కేంద్రానికి సమీపంలోని రింగో పట్టణంలో సుమారు 100 కి.మీ. మేర రోడ్లు దెబ్బతిన్నాయి.