నెల్లూరులో భూకంపం
జిల్లాలోని వరికుంట పాడు, దుత్తలూరు, ఉదయగిరి మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో ఆదివారం మధ్యాహ్నాం 12.15 గంటల సమయంలో భూకంపం సంభవించింది. సుమారు 2 సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. గత మూడు నెలల్లో భూమి కంపించడం ఇది నాలుగోసారి. ఎప్పుడు మళ్లీ భూమి కంపిస్తుందోనని ప్రజలు ఆందోళనలో ఉన్నారు. రిక్టర్ స్కేలుపై భూకంపతీవ్రత ఎంత నమోదు అయిందనే వివరాలు తెలియాల్సి ఉంది.