
పోర్ట్‌బ్లెయిర్ : సాధారణంగా మనషులు ఏడిస్తే కంట్లో నుంచి కన్నీళ్లు రావటం సహజం కానీ అండమాన్ నికోబార్ దీవికి చెందిన 22 ఏళ్ల యువకుడికి మాత్రం ఏడిస్తే రక్త కన్నీళ్లు వస్తాయి. మామూలుగా కంటినుంచి రక్తం కారే పరిస్థితిని ‘హీమోలాక్రియా’ అంటారు. ఈ వ్యాధి ఉన్న వారు ఏడ్చినపుడు రక్తం కారటం జరుగుతుంటుంది. కానీ ఆ యువకుడిలో హీమోలాక్రియా లక్షణాలు కనిపించకపోవటం విశేషం. తరుచుగా ఇలా కంటినుంచి రక్తం కారుతుండటంతో అతడు ‘అండమాన్ నికోబార్ ఐలాండ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’ వైద్యులను సంప్రదించాడు.
అతన్ని పరీక్షించిన డాక్టర్ జేమ్స్ అతనిలో ఎటువంటి వ్యాధి లక్షణాలు, ఆరోగ్య సమస్యలు లేవని గుర్తించాడు. 30శాతం మందికి ఇలా కారణం తెలియకుండా కంటినుంచి రక్తం కారుతుందని ఆయన తెలిపాడు. కంటిలో సమస్యలు, తలకు గాయాలు, ముక్కునుంచి రక్తం కారటం, రక్త సంబంధమైన వ్యాధులు వంటి సందర్భాలలో కంటినుంచి రక్తం కారే అవకాశం ఉందని ‘న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్’ పేర్కొంది. కారణం ఏదైనది బయటకు తెలియనప్పటికి అంతర్గతంగా ఉన్న సమస్యల వల్లే ఇలా అవుతుందని ప్రచురించింది.
Comments
Please login to add a commentAdd a comment