పోర్ట్ బ్లెయిర్: సముద్రంలో ప్రయాణికులతో వెళుతున్న బోటు బోల్తాపడటంతో 21 మంది మృత్యువాత పడిన ఘటన ఆదివారం అండమాన్ సమీపంలో చోటు చేసుకుంది. బంగాళాఖాతంలో పర్యాటకులతో పయనిస్తున్న సమయంలో ఈ దుర్ఘటన సంభవించింది. ఈ ప్రమాదంలో భారీ ప్రాణ నష్టం జరగగా, 13 మందిని సహాయక సిబ్బంది రక్షించారు.
పడవలో మొత్తం45 మంది వరకూ ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. మిగిలిన ప్రయాణికులను వెలికితీసేందుకు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. విహారయాత్రకు బయల్దేరిన వీరంతా తమిళనాడు రాష్ట్రంలోని కంచీపురంకు చెందిన వారిగా గుర్తించారు.