న్యూఢిల్లీ: అండమాన్ నికోబార్ దీవుల్లో సోమవారం స్వల్ప భూకంపం సంభవించింది. రెక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.6 గా నమోదైంది. నికోబార్ దీవుల్లోని మోహిన్‌కు 216 కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. కాగా ఏలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం రాలేదు.