
పోర్ట్ బ్లేయర్ : అండన్‌మాన్ నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించింది. బుధవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంపం తీవ్రత 5.6గా నమోదైంది. భూప్రకంపనలు సంభవించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఇదిలా ఉండగా మంగళవారం.. నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. రిక్టార్ స్కేల్‌పై దీని తీవ్రత 4.1గా నమోదయ్యింది. రెండు రోజుల్లో వరుస భూకంపాలు సంభవించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.