'అండమాన్' మృతులకు ప్రధాని ఎక్స్గ్రేషియా | Andamans boat tragedy: PM announces relief | Sakshi
Sakshi News home page

'అండమాన్' మృతులకు ప్రధాని ఎక్స్గ్రేషియా

Published Tue, Jan 28 2014 3:31 PM | Last Updated on Mon, Sep 17 2018 7:44 PM

'అండమాన్' మృతులకు ప్రధాని ఎక్స్గ్రేషియా - Sakshi

'అండమాన్' మృతులకు ప్రధాని ఎక్స్గ్రేషియా

అండమాన్ నికోబార్ దీవుల్లో ఆదివారం జరిగిన పడవ ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలకు ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మృతి చెందిన ఒక్కొకుటుంబానికి రూ. 2 లక్షల ఎక్స్గ్రేషియా అందజేయనున్నట్లు చెప్పారు. పడవ దుర్ఘటన పట్ల ఆయన తీవ్ర విచారణ వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం తన ట్విట్టర్లో మంగళవారం ఆ విషయాన్ని పోస్ట్ చేసింది.

 

అండమాన్ నికోబార్ దీవులోని పోర్ట్ బ్లెయిర్ సమీపంలో ఆదివారం 45 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ తిరగబడింది. ఆ ఘటనలో 31 మంది మరణించిన సంగతి తెలిసిందే. పడవ సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఎక్కడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుందని స్థానిక అధికారులు వెల్లడించారు. అయితే ఆ  ఘటనలో ఒక వ్యక్తి ఆచూకీ ఇంత వరకు లభ్యం కాలేదు. మృతులలో తమిళనాడు, మహారాష్ట్రకు చెందిన వారు ఉన్నారు.  జయలలిత ఇప్పటికే మృతి చెందిన ఒక్కొక్కరికి రూ. 1 లక్ష ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement