J. Jayalalithaa
-
జయలలిత చివరి రోజుల్లో తీసుకున్న నిర్ణయాలపై రహస్య విచారణ
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే చీఫ్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత చివరి రోజుల్లో తీసుకున్న అనేక నిర్ణయాల వెనుక అసలు కారణాలను వెలికితీయాలని తమిళనాడులో కొత్తగా కొలువుతీరిన డీఎంకే ప్రభుత్వం ఉన్నతాధికారులను ఆదేశించింది. ఆసుపత్రిలో జయలలిత చివరి ఆరునెలల కాలంలో ఫైళ్లపై సందేహాస్పద సంతకాలు, రూ.కోట్ల ఒప్పందాలు, టెండర్లు కట్టబెట్టడం తదితర అంశాలపై కూపీలాగాలని ఐఏఎస్ అధికారులను నూతన ముఖ్యమంత్రి స్టాలిన్ ఆదేశించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ముఖ్యమంత్రి స్టాలిన్ కోవిడ్ పరిస్థితులను చక్కబెట్టడంపైనే ప్రధానంగా దృష్టిసారించారు. గత అన్నాడీఎంకే ప్రభుత్వం అమలుచేసిన కోవిడ్ ఆంక్షలకు తోడుగా పూర్తి లాక్డౌన్ను ప్రవేశపెట్టి అమలుచేస్తున్నారు. అదే సమయంలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలపై విచారణ చేపట్టేందుకు స్టాలిన్ రహస్యంగా సమాయుత్తం అవుతున్నారు. అన్నాడీఎంకే హ యాంలో చేసుకున్న ఒప్పందాలు, జరిపిన నియా మకాలు, ఎవరెవరికి ప్రభుత్వ పనులు అప్పగించారు? ఏ పనులకు ఎంత ఖర్చు చేశారు? అనే అం శాలపై పూర్తి వివరాలు సేకరించాల్సిందిగా ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు. తన చుట్టూ అత్యంత విశ్వాసపాత్రులు, నిజాయితీపరులైన ఐఏఎస్ అధికారులను నియమించుకున్నారు. గత ప్రభుత్వ నిర్ణయాలను బహిరంగంగా వ్యతిరేకించిన ఐఏఎస్ అధికారులకు కీలక బాధ్యతలను అప్పగించారు. గత అన్నాడీఎంకే ప్రభుత్వంలోని అనేక వ్యవహారాలపై కూపీలాగే బాధ్యతలను సదరు ఐఏఎస్ అధికారులకు అప్పగించారు. ఈ అంశాల్లో ప్రధానమైనది ప్రభుత్వ ఫైళ్లలో ‘జయలలిత సంతకం’. 2016 సెపె్టంబరు 23న అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన జయలలిత అదే ఏడా ది డిసెంబరు 5న తుదిశ్వాస విడిచారు. ఆమె మరణానికి అసలు కారణాలను కనుగొనేందుకు అప్పటి ప్రభుత్వం నియమించిన విచారణ కమిషన్ ఇంతకాలమైనా ఇంకా నివేదిక సమరి్పంచలేదు. మరణానికి ముందు.. ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతున్న ఆరునెలల మధ్య కాలంలో ప్రభు త్వం తీసుకున్న నిర్ణయాలపై విచారణ జరపాలని డీఎంకే ప్రభుత్వం నిర్ణయించుకుంది. జయ ఆసుపత్రిలో చేరేముందు కొన్ని వారాలపాటు ఫైళ్లపై ఆమె సంతకాలు చేయలేదనే ఆరోపణలు, విమర్శలు ప్రస్తుతం రాష్ట్ర సచివాలయంలో పెరిగాయి. అధికారులు కొన్ని ఫైళ్లను వెలికి తీసి పరిశీలించగా జయలలిత సంతకం చేయకుండానే నిర్ణయాలు జరిగినట్లు బయటపడింది. ఆయా ఫైళ్లలో సీఎం హోదాలో జయలలిత సంతకం చేయాల్సిన చోట ‘జే æజే’ అనే అక్షరాలే ఉన్నాయి. ఇలాంటి సంతకాలున్న ఫైళ్లపైనే ముఖ్యంగా విచారణ జరపాలని సీఎం స్టాలిన్ ఆదేశించారు. రూ.కోట్ల విలువైన కొన్ని టెండర్లు సైతం జయసంతకం లేకుండానే ఆమోదం పొందినట్లు తేలింది. జయకు తెలియ కుండానే ఈ నిర్ణయాలు జరిగాయా? లేక ఆసుపత్రిలో ఉన్న ఆమెకు చెప్పి చేశారా? అప్పట్లో అత్యున్నత బాధ్యతల్లో ఉన్న ఉన్నతాధికారుల ప్రమే యంపై సైతం దర్యాప్తు జరుగుతున్నట్లు సమాచారం. జె.జె. అనే అక్షరాలు జయలలిత సంతకమేనని ఆసుపత్రిలో ఉన్నపుడు ఆమె అలా సంతకం చేశా రని కొందరు చెబుతున్నారు. డీఎంకే అధికారం చేపట్టిన తరువాత అన్నాడీఎంకేను ఎ లాంటి ఒత్తిళ్లకు గురిచేయలేదు. కానీ, గత ప్రభుత్వ అవకతవకలపై నిగ్గుతేల్చేందుకు పరోక్షంగా డీఎంకే ప్రభుత్వం సిద్ధమైందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
అమ్మకోసం మరో సింహాసనం
చెన్నై: అసాధారణ వ్యక్తిత్వం..పోరాట పంథాతో తుదికంటూ పోరాడి దేశ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మహిళా రాజకీయవేత్త తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ డిశంబర్ 5న అమ్మ కన్నుమూయడం తమిళ ప్రజలతో పాటు పలు వర్గాలు విషాదంలో మునిగిపోయాయి. కథానాయకిగా సినీరంగంలో వెలుగుతూ రాజకీయాల్లోకి ప్రవేశించి విప్లవనాయకిగా కీర్తి గడించిన అలనాటి అందాల తార జయలలితకు తమిళ సినీ రంగ ప్రముఖులు ట్విట్టర్ ద్వారా నివాళు లర్పించారు. ముఖ్యంగా తమిళ సినీ అగ్ర కథానాయికలు అమ్మ ఆత్మకు శాంతి కలగాలంటూ ట్విట్ చేశారు. హీరోయిన్లు గౌతం వాసు దేవ్ మీనన్, రాధిక, త్రిష, శృతి హాసన్ తదితరులు ఆమెకు నివాళులర్పించినవారిలో వున్నారు. స్వర్గంలో ఆమెకోసం మరోసింహాసనం ఎదురుచూస్తోందని హీరోయిన్ త్రిష ట్వీట్ చేశారు. తనకు అత్యంత ఇష్టమైన వ్యక్తి జయలలిత అంటూ ఆమె సంతాపం ప్రకటించారు. ఆమెను కలవడం అదృష్టమనీ, చాలా గర్వంగా ఉందంటూ జయలలిత కలిసిన క్షణాలను ఆమె గుర్తు చేసుకున్నారు. అతి ధైర్యవంతమైన మహిళల్లో జయలలిత ఒకరని శృతి హాసన్ ట్వీట్ చేశారు. తమిళనాడు అత్యంత సాహసోపేతమైన మహిళా నాయకురాలని కోల్పోయిందని, ఆమె మృతి తీరనిలోటని విచారం వ్యక్తం చేశారు. ఆమె ఒక ఫైటర్ , అందరికీ స్పూర్తి ప్రదాత అంటూ ప్రముఖ నటి రాధిక శరత్ కుమార్ ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి జయలలిత మరణం తమిళ ప్రజలకు తీరని లోటు..కానీ వారి గుండెల్లో శాశ్వతంగా మిగిలిపోతారని, ఆత్మకు శాంతి కలగాలని రాధిక ప్రార్థించారు. మరోవైపు తమిళనాడుకేకాదు...యావత్ భారతదేశానికే సాహస పుత్రిక అని సూపర్ స్టార్ రజనీకాంత్ ట్విట్టర్ ద్వారా అమ్మ మృతికి సంతాపం తెలిపారు. బల్గేరియాలో షూటింగ్ లో ఉన్న అజిత్ కుమార్ అమ్మ మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. జీవితంలో అనేక యుద్ధాల్లో పోరాడుతూ ధైర్యంగా నిలబడ్డారనీ, ఈ సమయంలో ఈ విషాదాన్ని తట్టుకునే శక్తిని ఆ దైవం ప్రసాదించాలంటూ ట్వీట్ చేశారు. తనకు అత్యంత ఇష్టమైన వ్యక్తి జయలలిత అనీ హీరోయిన్ త్రిష సంతాపం ప్రకటించారు. స్వర్గంలో ఆమెకోసం మరోసింహాసనం ఎదురుచూస్తోందని ట్వీట్ చేశారు. ఆమెను కలవడం ఒక అదృష్టమనీ, ఇందుకు తనకు చాలా గర్వంగా ఉందంటూ జయలలితను కలిసిన క్షణాలను ఆమె గుర్తు చేసుకున్నారు. అతి ధైర్యవంతమైన మహిళల్లో జయలిలత ఒకరని మరో హీరోయిన్ శృతి హాసన్ ట్వీట్ చేశారు. తమిళనాడు ఒక సాహసోపేతమైన మహిళా నాయకురాల్ని కోల్పోయిందని, ఆమె మృతి తీరనిలోటని విచారం వ్యక్తం చేశారు. ఆమె ఒక ఫైటర్ , అందరికీ స్పూర్తి ప్రదాత అంటూ ప్రముఖ నటి రాధిక శరత్ కుమార్ ట్వీట్ చేశారు. ఆమె మరణం తమిళ ప్రజలకు తీరని లోటు..కానీ వారి గుండెల్లో శాశ్వతంగా మిగిలిపోతారని, ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. వీరందరితో పాటు పార్తీపన్, మాధవన్, నకుల్ , జయం రవి తదితర పలువురు సినీ ప్రముఖులు జయలలిత ఆత్మకు శాంతి కలగాలంటూ ట్వీట్స్ చేసారు. Der will never be another U❤️ #ironlady #TamilNadusdaughter #myalmamatter #ChurchParkian #mostcherishedmemories #darkestdayinTN #heartbroken pic.twitter.com/DUa4159DO4 — Trisha Krishnan (@trishtrashers) December 5, 2016 -
ఒక్క కోర్టు తీర్పుతో రాజకీయాల్లో పెనుమార్పులు!
చెన్నై: ముఖ్యమంత్రి జే.జయలలిత ఆదాయానికి మంచి ఆస్తులున్నాయనే ఆరోపణలతో నమోదైన కేసులో బెంగళూరు కోర్టు వెల్లడించే తీర్పు తమిళనాడు రాజకీయాలను ప్రభావితం చేస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 18 సంవత్సరాలుగా కోర్టు విచారణలో ఉన్న ఈ కేసులో జయలలిత, మరో ముగ్గురుపై తీర్పును శనివారం కర్నాటక రాజధాని బెంగళూరులోని ఓ ప్రత్యేక కోర్టు వెల్లడించనుంది. ఒకవేళ జయలలితకు వ్యతిరేకంగా కోర్టు తీర్పు వెలువడితే తమిళనాడు రాజకీయాల్లో పెనుమార్పులు వచ్చే అవకాశం ఉందని, అంతేకాకుండా 2016లో పార్టీ విజయావకాశాలు, ఆమె ఇమేజ్ దెబ్బతినడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ కుట్రలో బలయ్యానని ఆరోపణలు చేస్తున్న జయలలితకు అనుకూలంగా తీర్పు వస్తే డీఎంకే పరిస్తితి మరింత దెబ్బతినే విధంగా ఉంటుందంటున్నారు. 1996లో ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జయలలిత 66 కోట్ల రూపాయలు..లెక్కకు మించి ఉన్నాయని డీఎంకే అధినేత ఎం కరుణానిధి కేసు నమోదు చేశారు. -
'అండమాన్' మృతులకు ప్రధాని ఎక్స్గ్రేషియా
అండమాన్ నికోబార్ దీవుల్లో ఆదివారం జరిగిన పడవ ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలకు ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మృతి చెందిన ఒక్కొకుటుంబానికి రూ. 2 లక్షల ఎక్స్గ్రేషియా అందజేయనున్నట్లు చెప్పారు. పడవ దుర్ఘటన పట్ల ఆయన తీవ్ర విచారణ వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం తన ట్విట్టర్లో మంగళవారం ఆ విషయాన్ని పోస్ట్ చేసింది. అండమాన్ నికోబార్ దీవులోని పోర్ట్ బ్లెయిర్ సమీపంలో ఆదివారం 45 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ తిరగబడింది. ఆ ఘటనలో 31 మంది మరణించిన సంగతి తెలిసిందే. పడవ సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఎక్కడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుందని స్థానిక అధికారులు వెల్లడించారు. అయితే ఆ ఘటనలో ఒక వ్యక్తి ఆచూకీ ఇంత వరకు లభ్యం కాలేదు. మృతులలో తమిళనాడు, మహారాష్ట్రకు చెందిన వారు ఉన్నారు. జయలలిత ఇప్పటికే మృతి చెందిన ఒక్కొక్కరికి రూ. 1 లక్ష ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సంగతి తెలిసిందే. -
సినిమా వేడుకలకు తమిళనాడు ప్రభుత్వం రూ.10 కోట్ల విరాళం
చెన్నై:వందేళ్ల సినిమా వేడుకలకు తమిళనాడు ప్రభుత్వ చేయూతనిచ్చింది. త్వరలో జరుగనున్న సినిమా వేడుకలను పురస్కరించుకుని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత రూ.10 కోట్లను విరాళంగా ప్రకటించారు. ఈ నెల 21 నుంచి భారతీయ సినిమా శత జయంతి వేడుకలు చెన్నైలో జరుగుతున్న సంగతి తెలిసిందే. శత జయంతి వేడుకల్లో భాగంగా తమిళనాడు ప్రభుత్వం భారీ మొత్తంలో విరాళం ప్రకటించడం విశేషం. ఈ మేరకు దక్షిణ చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు కల్యాణ్ కు రూ.10 కోట్ల చెక్కును జయలలిత అందజేశారు. భారతీయ సినీ చరిత్రలో తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న తమిళులు విరాళాన్ని ప్రకటించడంలో కూడా తనదైన ముద్రను వేసుకున్నారు. -
నిన్న అమ్మ క్యాంటిన్.. నేడు అమ్మ మినరల్ వాటర్!
చెన్నై తమిళనాడు ముఖ్యమంత్రి జే జయలలిత 'అమ్మ మినరల్ వాటర్' పేరుతో మరో కొత్త పథకాన్ని చెన్నైలో ప్రారంభించారు. ఇటీవల జయలలిత 'అమ్మ క్యాంటిన్' ప్రారంభించిన సంగతి తెలిసిందే. అమ్మ మినరల్ వాటర్ పథకం ద్వారా ప్రజలకు 10 రూపాయలకే లీటర్ మంచినీటిని అందించనున్నారు. గుమ్మడిపొండి వద్ద ట్రాన్స్ పోర్ట్ డిపార్డ్ మెంట్ ఏర్పాటు చేసిన మూడు లక్షలు లీటర్ల కెపాసిటి గద వాటర్ ప్లాంట్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమిళనాట కొత్త పథకాన్ని ఆరంభించారు. తొలి మినరల్ బాటిల్ ను రవాణా శాఖ మంత్రి వీ సెంథీల్ బాలాజీ వద్ద జయలలిత కొనుగోలు చేశారు. అమ్మ క్యాంటిన్ పథకం కోసం ఏర్పాటు చేసిన సహకార దుకాణాల్లో కూరగాయలు, బియ్యంతోపాటు మినరల్ వాటర్ ను కూడా అందించేందుకు జయలలిత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అమ్మ మినరల్ వాటర్ ను బస్ స్టేషన్లతోపాటు దూర ప్రాంతాలకు ప్రయాణించే బస్సుల్లో కూడా విక్రయిస్తామన్నారు. అమ్మ క్యాంటిన్ లో ఇడ్లీ ఒక్క రూపాయి, పొంగల్, సాంబార్, లెమన్ రైస్ ఐదు రూపాయలకు, పెరుగు అన్నం 3 రూపాయలకు అందిస్తున్న సంగతి తెలిసిందే.