నిన్న అమ్మ క్యాంటిన్.. నేడు అమ్మ మినరల్ వాటర్!
చెన్నై
తమిళనాడు ముఖ్యమంత్రి జే జయలలిత 'అమ్మ మినరల్ వాటర్' పేరుతో మరో కొత్త పథకాన్ని చెన్నైలో ప్రారంభించారు. ఇటీవల జయలలిత 'అమ్మ క్యాంటిన్' ప్రారంభించిన సంగతి తెలిసిందే. అమ్మ మినరల్ వాటర్ పథకం ద్వారా ప్రజలకు 10 రూపాయలకే లీటర్ మంచినీటిని అందించనున్నారు. గుమ్మడిపొండి వద్ద ట్రాన్స్ పోర్ట్ డిపార్డ్ మెంట్ ఏర్పాటు చేసిన మూడు లక్షలు లీటర్ల కెపాసిటి గద వాటర్ ప్లాంట్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమిళనాట కొత్త పథకాన్ని ఆరంభించారు. తొలి మినరల్ బాటిల్ ను రవాణా శాఖ మంత్రి వీ సెంథీల్ బాలాజీ వద్ద జయలలిత కొనుగోలు చేశారు.
అమ్మ క్యాంటిన్ పథకం కోసం ఏర్పాటు చేసిన సహకార దుకాణాల్లో కూరగాయలు, బియ్యంతోపాటు మినరల్ వాటర్ ను కూడా అందించేందుకు జయలలిత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అమ్మ మినరల్ వాటర్ ను బస్ స్టేషన్లతోపాటు దూర ప్రాంతాలకు ప్రయాణించే బస్సుల్లో కూడా విక్రయిస్తామన్నారు. అమ్మ క్యాంటిన్ లో ఇడ్లీ ఒక్క రూపాయి, పొంగల్, సాంబార్, లెమన్ రైస్ ఐదు రూపాయలకు, పెరుగు అన్నం 3 రూపాయలకు అందిస్తున్న సంగతి తెలిసిందే.