తమిళనాడులో ‘అమ్మ డీఎంకే’ ఆవిర్భావం | Iniyan Sampath launches Amma DMK | Sakshi
Sakshi News home page

తమిళనాడులో ‘అమ్మ డీఎంకే’ ఆవిర్భావం

Published Mon, Dec 26 2016 6:32 AM | Last Updated on Mon, May 28 2018 4:09 PM

తమిళనాడులో ‘అమ్మ డీఎంకే’ ఆవిర్భావం - Sakshi

తమిళనాడులో ‘అమ్మ డీఎంకే’ ఆవిర్భావం

సాక్షి, చెన్నై : తమిళనాడులో అమ్మ డీఎంకే అనే కొత్త పార్టీ ఆవిర్భవించింది. ద్రావిడ ఇయక్కంలో ఒకప్పుడు కీలక నేతగా ఎదిగిన ఈవీకే సంపత్‌ కుమారుడు ఇనియన్‌ సంపత్‌ ఈ పార్టీకి నేతృత్వం వహిస్తున్నారు. అన్నాడీఎంకేను ఆంగ్లంలో జాతీయ స్థాయిలో ఏఐడీఎంకే, రాష్ట్రంలో ఏడీఎంకే అని పిలుస్తుంటారు.

ఈ పిలుపులో గందరగోళాన్ని సృష్టించే విధంగా మరో ఏడీఎంకే ఆవిర్భవించింది. అమ్మ సేనల్ని ఆకర్షించే విధంగా, అన్నాడీఎంకేలో గందరగోళాన్ని రేకెత్తించే విధంగా అమ్మ డీఎంకే (ఏడీఎంకే)ను చెన్నైలో ఏర్పాటు చేశారు. అన్నాడీఎంకే జెండాను పోలిన జెండాను తన ఇంటిపై ఎగుర వేశారు. అన్నాడీఎంకే జెండాలో రెండాకుల చిహ్నం ఉండగా, అమ్మ డీఎంకే జెండాలో జయలలిత విక్టరీ సంకేతంతో చిహ్నాన్ని పొందుపరిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement