చౌహాన్ చౌక భోజనం.. ఎంతో తెలుసా?
చౌహాన్ చౌక భోజనం.. ఎంతో తెలుసా?
Published Fri, Sep 9 2016 2:03 PM | Last Updated on Mon, Oct 8 2018 3:17 PM
భోపాల్ : తమిళనాడులో విజయవంతమైన సీఎం జయలలిత అమ్మ క్యాంటీన్లు చూశాం.. ఇప్పుడు ఆమె బాటలోనే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ కూడా అడుగులు వేస్తున్నారు. పేద ప్రజలకు ఆకలి తీర్చేందుకు రూ.10కే కడుపునిండా భోజనం పెట్టేందుకు చౌహాన్ ప్లాన్ చేస్తున్నారు. పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి వేడుకలను పురస్కరించుకుని సెప్టెంబర్ 25న ఈ సబ్సిడీ భోజన ప్రోగ్రామ్ను ప్రారంభించాలని చౌహాన్ భావిస్తున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది.
ఇటీవల జరిగిన పార్టీ మీటింగ్లో చౌహాన్ ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఒక ప్లేట్ భోజనంలో రోటీ, పప్పు, కూర, అన్నం, పచ్చడి ఉంటాయని, మొదట ఈ ప్రోగ్రామ్ను భోపాల్, ఇండోర్, గ్వాలియర్, జబల్పూర్లో ప్రారంభిస్తారని అధికారులు పేర్కొంటున్నారు. అనంతరం మిగతా ప్రాంతాలకు విస్తరించనున్నట్టు అధికారులు తెలిపారు. స్థానిక మున్సిపల్ కార్పొరేషన్, ఫుడ్ డిపార్ట్మెంట్ అడ్మిన్స్ట్రేషన్ కలిసి వివిధ క్యాంటిన్లలో భోజనాన్ని పేద ప్రజలకు అందించే బాధ్యతను పర్యవేక్షించాల్సి ఉంటుందని చౌహాన్ అధికారులకు సూచిస్తున్నట్టు తెలుస్తోంది.
Advertisement