ఒక్క కోర్టు తీర్పుతో రాజకీయాల్లో పెనుమార్పులు! | J.Jayalalithaa verdict will impact Tamil Nadu politics | Sakshi
Sakshi News home page

ఒక్క కోర్టు తీర్పుతో రాజకీయాల్లో పెనుమార్పులు!

Published Thu, Sep 25 2014 6:46 PM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM

ఒక్క కోర్టు తీర్పుతో రాజకీయాల్లో పెనుమార్పులు! - Sakshi

ఒక్క కోర్టు తీర్పుతో రాజకీయాల్లో పెనుమార్పులు!

చెన్నై: ముఖ్యమంత్రి జే.జయలలిత ఆదాయానికి మంచి ఆస్తులున్నాయనే ఆరోపణలతో నమోదైన కేసులో బెంగళూరు కోర్టు వెల్లడించే తీర్పు తమిళనాడు రాజకీయాలను ప్రభావితం చేస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 18 సంవత్సరాలుగా కోర్టు విచారణలో ఉన్న ఈ కేసులో జయలలిత, మరో ముగ్గురుపై తీర్పును శనివారం కర్నాటక రాజధాని బెంగళూరులోని ఓ ప్రత్యేక కోర్టు వెల్లడించనుంది. 
 
ఒకవేళ జయలలితకు వ్యతిరేకంగా కోర్టు తీర్పు వెలువడితే తమిళనాడు రాజకీయాల్లో పెనుమార్పులు వచ్చే అవకాశం ఉందని, అంతేకాకుండా 2016లో పార్టీ విజయావకాశాలు, ఆమె ఇమేజ్  దెబ్బతినడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 
 
రాజకీయ కుట్రలో బలయ్యానని ఆరోపణలు చేస్తున్న జయలలితకు అనుకూలంగా తీర్పు వస్తే డీఎంకే పరిస్తితి మరింత దెబ్బతినే విధంగా ఉంటుందంటున్నారు. 1996లో ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జయలలిత 66 కోట్ల రూపాయలు..లెక్కకు మించి ఉన్నాయని డీఎంకే అధినేత ఎం కరుణానిధి కేసు నమోదు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement