
అండమాన్ నికోబర్ : కరోనా వైరస్ ప్రపంచాన్ని కుదిపేస్తుంది. ఈ మహమ్మరి కారణంగా ఇప్పటికే వేలమంది ప్రాణాలు కోల్పోయారు. భారత్‌లో సైతం కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. వైరస్ కట్టడి కోసం లాక్‌డౌన్‌ను పొడిగించినా కేసుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. అయితే అండమాన్ నికోబార్ దీవుల్లో మాత్రం కరోనా సోకిన వారంతా కోలుకున్నారు. మొత్తం 11 మందికి కోవిడ్ సోకగా ఇప్పడు వారంతా కోలుకున్నారని అండమాన్ నికోబార్ దీవుల చీఫ్ సెక్రటరీ చేతన్ సంఘి ప్రకటించారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరిస్తూ అప్రమత్తంగా ఉంటామని చెప్పారు. కరోనా కట్టడికి అన్ని చర్యలూ తీసుకుంటున్నామన్నారు. మరోవైపు కరోనా కట్టడికి అక్కడి అధికారులు తీసుకున్న చర్యలను అంతా అభినందిస్తున్నారు. సోషల్ మీడియాలో వైద్య సిబ్బందిపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
11 out of 11 positive cases recovered: Chetan Sanghi, Chief Secretary, Andaman and Nicobar Islands#COVID19 pic.twitter.com/XJccIpllKT
— ANI (@ANI) April 16, 2020