
న్యూఢిల్లీ : అండమాన్, నికోబర్ దీవుల్లో ఓ అమెరికన్ టూరిస్టును గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. బాధిత టూరిస్ట్‌ను జాన్ అలెన్‌గా గుర్తించారు. జాన్ హత్యకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు ఏడుగురు అనుమానితులను అరెస్ట్ చేశారు. బాధితుడు గతంలో ఐదు సార్లు అండమాన్‌కు వచ్చారని, క్రైస్తవ బోధనలను ఉత్తర సెంటినెల్ ద్వీపంలోని గిరిజనులకు అందుబాటులోకి తీసుకురావాలని తపన పడేవాడని స్ధానిక మీడియా పేర్కొంది.
జాన్ అలెన్ చిదియతపు ప్రాంతం నుంచి కొందరు మత్స్యకారుల సహకారంతో ఈనెల 16న ఉత్తర సెంటినెల్ ద్వీపానికి చేరుకున్నారు. ఉత్తర సెంటినెల్ ద్వీపంలో నివసించే తెగ బయటి ప్రపంచంతో సంబంధాలు పెట్టుకునేందుకు ఇష్టపడదని చెబుతున్నారు. కాగా ఈ తెగలో కేవలం 50 మంది జనాభా ఉన్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment